త్రిముఖ పోటీ?
నిర్మల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో జిల్లాలో అన్ని తానై, ఒంటిచేత్తో చక్రం తిప్పుతున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలకు నిర్మల్‌ను టీఆర్‌ఎస్‌ కంచుకోటగా చేయాలనుకుంటున్నారు.
 
నియోజకవర్గంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ , టీడీపీ బరిలో ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుంటూ చక్రం తిప్పుతున్న అల్లోల ధాటికి ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు విజయం సాధిస్తాయో ఊహకు కూడా అందడం లేదని పలువురు తెలుపుతున్నారు. అభ్యర్థి గెలుపుకు మైనార్టీలే కీలకం కాబట్టి అన్ని పార్టీల ఇన్‌చార్జ్‌లు వారిపైనే గురి పెట్టారు. కేసీఆర్ కేబినెట్‌లో న్యాయశాఖ, దేవాదాయ శాఖ లాంటి కీలక శాఖలను అల్లోల నిర్వహించారు. 2018 ఎన్నికల టిక్కెట్ కూడా దక్కడంతో ఇంద్రకరణ్ రెడ్డి తన ప్రచారాన్ని ఇప్పటికే తీవ్రతరం చేశారు.
ADVT

ADVT
వ్యాపారాలు:
ఉత్తర భారతదేశంలో తన స్నేహితులతో కలిసి ప్రారంభించిన ఓ కంపెనీకి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇంతవరకు ఆయనపై ఒక్క వివాదాస్పదమైన విషయం కూడా లేదు.