రేవంత్ లక్ష్యం నెరవేరేనా..?
 రేవంత్‌ రెడ్డి మాటల చాతుర్యం ప్రదర్శిస్తూ రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు ముందుకు వెళుతున్నారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసిన ఈయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపదవులను చేపడుతూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయ జీవితంలో అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. గతంలో టీడీపీలో ఉండగా,  ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో తనదైన ముద్రను వేసుకునేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ సర్కారుపై విమర్శలను గుప్పిస్తూ.. కేసీఆర్‌ను ఢీకొట్టగలిగే నేతగా గుర్తింపుతెచ్చుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే క్రమంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించకుండా.. ఆయన తన రాజకీయ గురువు అని చంద్రబాబును కొనియాడారు. ఎప్పటికయినా తెలంగాణ ముఖ్యమంత్రి అవడమే తన లక్ష్యమని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
ADVT

ADVT
రియల్‌ ఎస్టేట్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌ వ్యాపారాలున్నాయి. 2014 ఎన్నికల అనంతరం 31-5-2015న ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. హైదరాబాద్‌లో, కొండరెడ్డిపల్లిలో ఇళ్లు ఉన్నాయి.
మాటల చాతుర్యంతో ఇతరుల మన్ననలు పొందుతారు. హాకీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ రెండు సార్లు కొడంగల్‌ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు.