ఆయనకు ఆయనే సాటి
తన్నీరు హరీశ్‌రావు మొట్టమొదటి సారిగా 2004 ఉప ఎన్నికలలో సిద్దిపేట నుంచి పోటీ చేశారు. వారి మామ కె.చంద్రశేఖర్‌రావు 2004 ఎన్నికలలో సిద్దిపేట శాసనసభ , కరీంనగర్‌ లోక్‌సభల నుంచి పోటీ చేసి గెలుపొందారు. సిద్దిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హరీశ్‌రావు బరిలో నిలిచారు. అప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ , టీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన నేపథ్యంలో హరీశ్‌రావు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అనంతరం 2008, 2009 ,2010, 2014లలో జరిగిన ఎన్నికలలో వరుస విజయాలు సాధించి తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందారు.
 
ఆయన హయాంలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం బహుముఖాభివృద్ధి చెందింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన ఉన్నప్పుడు కూడా నిధులు మంజూరు చేయించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో సిద్దిపేట సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన నిధులన్నీ వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా సిద్దిపేట నుంచే పోటీ చేయమని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆదేశించింది. టిక్కెట్ కూడా ఇచ్చింది.
ADVT

ADVT
హరీష్‌రావు ఆస్తి: రూ.3.14కోట్లు
హరీష్‌రావు, ఆయన భార్య శ్రీనిత పేరిట సుమారు రూ.3.14కోట్ల రూపాయల విలువ గల ఆస్తులున్నట్లు ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారికి  దాఖలు చేసిన అపిడవిట్‌లో పేర్కొన్నారు. హరీష్‌రావు పేరిట నగదు రూ.18లక్షలు, భార్య శ్రీనిత వద్ద రూ.8లక్షల నగదు ఉన్నట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎస్‌బీహెచ్‌ బ్రాంచ్‌ సేవింగ్స్‌ ఖాతాలో రూ.17,21,637లు, హైదరాబాద్‌ అసెంబ్లీ బ్రాంచ్‌ ఎస్‌బీహెచ్‌లో రూ.1,67,978లు, ఎల్‌ఐసీ ప్రీమీయం రూ.25,272లు, ఫర్మ్‌లు, కంపనీలు, ట్రస్టులలో రూ.37లక్షలు, ఇన్నోవా కారు విలువ రూ.16,65,832 ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆయన భార్య శ్రీనిఖిత పేరిట జూబ్లి హిల్స్‌ హెడిఎఫ్‌సీ బ్యాంకులో రూ.3,82,648లు, బంజారా హిల్స్‌ ఎస్‌బీ ఖాతాలో రూ.7,46,189లు, జూబ్లి హిల్స్‌ ఎస్‌బీహెచ్‌ ఖాతాలో రూ.11,005లు, నల్లకుంట రుచి చిట్‌ఫండ్స్‌లో రూ.5,10,474లు, వైష్ణవి ఫ్యాషన్స్‌ యజమానిగా పెట్టుబడి రూ.1,18,52,777లు, ఐసీఐసీఐ ప్రీమియం రూ.3204లు, ఎల్‌ఐసీ ప్రీమియంగా రూ. 16,592లున్నట్లు వెల్లడించారు. రూ.17.56లక్షల విలువ గల 520గ్రాముల బంగారు నగలు, కిలోనర వెండి సామాగ్రి ఉన్నట్లు చూపించారు.
 
భూముల వివరాలు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి వద్ద సర్వే నెంబర్‌ 178,196లలో సుమారు రూ.15ల క్షల విలువ గల 17.03 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తట్టికుంట సర్వేనెంబర్‌ 32లో రూ.12లక్షల విలువ గల 8.264 గుంటల భూమి, సిద్దిపేట భారత్‌నగర్‌లో రూ.18ల క్షల విలువ గల 200 చదరపు గజాల ఇల్లు ఉన ్నట్లుగా హరీశ్‌రావు చూపించారు. తన పేరిట సిద్దిపేట ఎస్‌బీహెచ్‌లో రూ.1,00,643ల ఇంటి రుణం, భార్య శ్రీనిత పేరిట బంజారాహిల్స్‌ హెడిఎఫ్‌సీలో రూ.21,25,670లు వ్యాపార రుణం ఉన్నట్లుగా పేర్కొన్నారు. కుమారుడు ఆర్చిస్‌మాన్‌, కుమార్తె వైష్ణవిల పేరిట ఎలాంటి ఆస్తులు లేవని చూపించారు.
మామ కేసీఆర్ మాటను శిరసా వహిస్తారు. కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆయన గీసిన గీతను దాటనని.. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో తేల్చిచెప్పేశారు. కేసీఆర్ లేనిదే తాను లేననీ, కేటీఆర్‌తో విబేధాలు అస్సలు లేవని హరీష్ స్పష్టం చేశారు.