మహబూబ్ నగర్
ఒక నియోజకవర్గం..అనేక మంది నేతలు
బలమైన సామాజికవర్గాలు, బలమైన నాయకులు బరిలో నిలిచే మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి అదృష్టం ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వి.శ్రీనివాస్‌గౌడ్‌ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఆయనకే టికెట్ కేటాయించడంతో మరోమారు బరిలో నిలవనున్నారు. గత ఎన్నికల తర్వాత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీని విభేదించి తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. పొత్తుల్లో భాగమైనా, లేక సొంతంగా పోటీచేసినా తెలంగాణ ఇంటిపార్టీ నుంచి తన పోటీ ఖాయమని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇక మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎర్ర శేఖర్ బరిలో దిగుతున్నారు. వీరితో పాటు బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, పట్టణాధ్యక్షుడు పాండురంగారెడ్డి పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా పట్టణంలోని విద్యావేత్తలు కే.ఎస్‌.రవికుమార్‌ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా హేమాహేమీలు బరిలో ఉండే అవకాశాలుండడంతో ఈసారి మహబూబ్‌నగర్‌ అసెంబ్లీపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలయింది.

ADVT
నియోజకవర్గ ఓటర్లు: 2,07,280 
పురషులు-  1,04,033
స్త్రీలు - 1,03,244
ఇతరులు -  03
నియోజకవర్గంలో కీలక వర్గాలు: 
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఓట్లు సాధించేందుకు రాజకీయపార్టీల మధ్య ఎత్తులు, పైఎత్తులు సాగుతూ ఉంటాయి. మొత్తం 1,87,328 మంది ఓటర్లున్న మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు 40వేల పైచిలుకు ఉంటాయి. ఆ తర్వాత ఎస్సీ సామాజికవర్గం ఓట్లు 25 వేల వరకు ఉంటాయని భావిస్తున్నారు. ముదిరాజ్‌ సామాజికవర్గం ఓట్లు సుమారు 20వేలు, కురుమ, యాదవ సామాజికవర్గం ఓట్లు 13వేల వరకు, క్రిస్టియన్‌ కమ్యూనిటీ ఓట్లు 12వేల వరకు, గౌడ్‌ సామాజికవర్గం ఓట్లు 12వేల వరకు, రెడ్డి సామాజికవర్గం ఓట్లు 12వేల వరకు ఉంటాయని అంచనా. ఆర్యవైశ్య సామాజికవర్గం ఓట్లు 4 వేలు, బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు 3 వేలు, ఎస్టీల ఓట్లు 3 వేలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బీసీ, ముస్లిం ఓట్ల సమీకరణే ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారుతుంది. జిల్లా కేంద్రమవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఓట్లకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముస్లిం కమ్యూనిటీ ఓట్లు గంపగుత్తగా పడే అవకాశాలుండడంతో ఈ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ,ప్రతివ్యూహాలతో వ్యవహరిస్తుంటాయి.
ఇరిగేషన్‌ ప్రాజెక్టులేవీ ఈ నియోజకవర్గంలో లేవు. చెప్పుకోదగ్గ సంస్థలు ప్రభుత్వరంగం నుంచి కానీ, ప్రైవేట్‌ రంగం నుంచి కానీ ఇక్కడ ఏర్పాటు కాలేదు.
వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఎమ్మెల్యే, సీ. రాధా అమర్‌ (మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌), ఇంతియాజ్‌ ఇసాక్‌ (టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి), బెక్కెం జనార్థన్‌ (మాజీ జిల్లా కన్వీనర్‌), రాజేశ్వర్‌గౌడ్‌ (జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్‌) ఎస్‌. జైపాల్‌రెడ్డి (కేంద్రమాజీమంత్రి), పి.చంద్రశేఖర్‌ (రాష్ట్ర మాజీమంత్రి), ఒబేదుల్లా కొత్వాల్‌(డీసీసీ అధ్యక్షుడు), ఎం.సురేందర్‌రెడ్డి (నియోజకవర్గ నాయకుడు), సంజీవ్‌ ముదిరాజ్‌ (డీసీసీ ఉపాధ్యక్షుడు), ఎన్‌పీ వెంకటేశ్‌ (అడ్వకేట్‌), ముత్యాల ప్రకాష్‌ (మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌). పద్మజా రెడ్డి (బీజేపీ), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
పిల్లలమర్రి పర్యాటక క్షేత్రం, మయూరి పార్కు, మన్యంకొండ దేవస్థానం.