నిజామాబాద్ రూరల్
బాజిరెడ్డికి ఈసారి గట్టి పోటీ!
నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరోమారు టీఆర్ఎస్ నుంచే పోటీ చేయనున్నారు. గతంలో ఆయన ఆర్మూర్‌, బాన్సువాడల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అరికెల నర్సారెడ్డి, మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్‌ నగేష్‌రెడ్డి, తాహెర్‌బిన్‌ హుందాన్‌ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి గడ్డం ఆనంద్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి మండవ వెంకటేశ్వర్‌రావ్‌ పోటీ చేసే అవకాశం ఉంది. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ మధ్యనే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పోటిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నియోజవర్గానికి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు కూడా ఈ దఫా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీ లేదా ఇతర పార్టీల నుంచి పోటీచేస్తే మిగతా వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడనుంది. బీజేపీ నుంచి ఈసారి కేశ్‌పల్లి ఆనంద్ రెడ్డికి టిక్కెట్ కేటాయించారు.  పార్లమెంటరీ పార్టీ ఆమోదం తెలిపిన తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ADVT
మొత్తం ఓట్లు: 2,11,448
పురుషులు: 98,783
స్త్రీలు: 1,12,653
ఇతరులు: 12
 
నియోజకవర్గంలో కీలక సామాజికవర్గాలు: ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు, రెడ్డి, గొల్ల కురుములు, ముదిరాజ్‌, పద్మశాలి, వడ్డెర, మైనార్టీ, ఎస్సీ ఓట్లు కీలకం కానున్నాయి.
ఈ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసి కళాశాలలు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రామడుగు చిన్న నీటి వనరుల ప్రాజెక్ట్‌ ఉంది. అటవీ ప్రాంతం కూడా నియోజకవర్గం పరిధిలో ఉంది. మిట్టాపల్లి పవర్‌గ్రిడ్‌ ఈ నియోజకవర్గంలోనే ఉంది.
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు ఈ నియోజకవర్గానికి చెందినవారు. డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హుందాన్‌ కూడా ఈ నియోజకవర్గం పరిధిలోని సిరికొండ మండలానికి చెందినవారు.
 
బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్‌ఎస్)
డీ. శ్రీనివాస్ (టీఆర్‌ఎస్)
అరికెల నర్సారెడ్డి (టీడీపీ)
భూమ్‌రెడ్డి (కాంగ్రెస్)
నగేష్ రెడ్డి (కాంగ్రెస్)
డాక్టర్ భూపతి రెడ్డి (టీఆర్‌ఎస్)
గడ్డం ఆనంద్ రెడ్డి (బీజేపీ)
ఖిల్లా రామాలయం, 7వ పోలీస్‌ బెటాలియన్‌, సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర ఆలయం, రైస్‌ మిల్లులు, గౌడాన్‌లు, తెలంగాణ సీడ్స్‌, జిల్లా పశుగణణాభివృద్ధి సంస్థ, విజయ డైరీ, జిల్లా జైల్‌, సారంగపూర్‌ హనుమాన్‌ ఆలయం, మల్కాపూర్‌ అనంత పద్మనాభస్వామి ఆలయం, కాగిత పరిశ్రమలు ఉన్నాయి.