శ్రీవికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం; తిథి: తదియ పూర్తి; నక్షత్రం: శతభిషం పూర్తి; వర్జ్యం: మ. 2.47-4.33; దుర్ముహూర్తం: మ. 12.51-1.35, మ. 3.05-3.50; అమృతఘడియలు: రా. 1.25-3.11; రాహుకాలం: ఉ. 7.30-9.00; సూర్యోదయం: 6.52; సూర్యాస్తమయం: 6.04
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జనవరి 28, 2020)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకలు ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

సమావేశాలు, బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థిక వ్యవహరాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

రక్షణ, బోధన, న్యాయ, రవాణా, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, పెన్షన్‌ లావాదేవీలకు అనుకూలం.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

కొత్త పరిచయాలు లక్ష్యసాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్యసాధనకు తోడ్పడతాయి. హోటల్‌, ఆస్పత్రులు, సేవారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

వివాహాది శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విద్యాసంస్థలు, చిట్‌ఫండ్స్‌, ప్రకటనా రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులకు శుభప్రదం.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సోదరీసోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఆరా తీస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

వేడుకల్లో పాల్గొంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు సాంత్వన చేకూరుస్తాయి.
దినఫలాలు (జన్మ తేది ప్రకారం)
(జనవరి 27, 2020)

మేషం (మార్చి 21-ఏప్రిల్‌ 20 మధ్య పుట్టినవారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. విరాళాలు, చందాలకు వెచ్చిస్తారు. దీర్ఘకాలికి పెట్టుబడులకు అనుకూలం. సినీ, రాజకీయ రంగాల వారికి అర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం.

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)

సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో లక్ష్యసాధనకు పెద్దల సహకారం లభిస్తుంది.

మిథునం (మే 22-జూన్‌ 21 మధ్య పుట్టినవారు)

వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రకటనలు, కమ్యూనికేషన్లు, ఆడిటింగ్‌ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరం. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దలతో సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు.

కర్కాటకం (జూన్‌ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)

ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. పోలీస్‌, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. ప్రయాణాలు, సమావేశాలకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు.

సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)

బీమా, గ్రాట్యుటీ, పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. భాగస్వామి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం మెరుగవుతుంది. క్రయవిక్రయాలకు అనుకూలం.

కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు, వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి.

తుల(సెప్టెంబర్‌ 23-అక్టోబర్‌ 23 మధ్య పుట్టిన వారు)

ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రకటనలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగవుతుంది.

వృశ్చికం (అక్టోబర్‌ 24- నవంబర్‌ 22 మధ్య పుట్టినవారు)

మనసు ఉల్లాసంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్స్‌కు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు (నవంబర్‌ 23-డిసెంబర్‌ 21 మఽధ్య పుట్టిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలవారు కీలక సమాచారం అందుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.

మకరం (డిసెంబర్‌ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)

బోధన, రవాణా, స్టేషనరీ, కమ్యూనికేషన్ల రంగా వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. విలువైన పత్రాలు అందుకుంటారు. ప్రయాణాలకు నిధులు సర్దుబాటవుతాయి. సోదరీసోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత గమనించాలి.

మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)

కొంతకాలంగా వెంటాడుతున ్న స్తబ్దత తొలగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
91